ఈ పోస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద ఇరవై నగరాల (Top 20 Biggest cities in Andhra Pradesh) గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్టు 2023 సంవత్సరానికి సంబంధించిన అర్బన్ ఏరియా పాపులేషన్ (అర్బన్ ప్రాంత జనాభా) ప్రకారం మీ ముందు ఉంచు తున్నాము. ఇప్పుడు ప్రపంచం లో అన్ని చోట్లా కేవలం జనాభా ప్రాతిపదికన ఊర్లను వర్గీకరిస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్ ను మూడు టాప్ వెబ్సైట్ లో డేటాను పరిగణనలోకి తీసుకుని తయారు చేసాము. ఊరు విశాలతను అందరూ 2000 నుంచే పరిగణనలోకి తీసుకోవడం లేదు కాబట్టి, మేము కూడా జనాభా పరంగా ఈ లిస్టు ను తయారు చేశాము అని గమనించండి.
వీటిలో కొన్ని ఊర్లు ఇప్పటికీ మున్సిపాలిటీ లాగానే ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని మునిసిపల్ కార్పొరేషన్ నగరాల జనాభాను ఎప్పుడో దాటే సాయి. దీనికి ముఖ్య కారణం కొన్ని ఊర్లను చిన్నగా ఉన్నా మునిసిపల్ కార్పొరేషన్లు గా ప్రకటించడమే. ఉదాహరణకు పాత చిత్తూరు జిల్లాలో తిరుపతి అతి పెద్ద పట్టణమైనా, జిల్లా కేంద్రంగా చిత్తూరు ఉండడం వల్ల చిత్తూరు ను మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. అలాగే జిల్లా కేంద్రం అయినా చిత్తూరు లో అన్ని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి, ఊరు విశాలంగా వుంటుంది. కానీ జనాభా పరంగా తక్కువగా పెరుగుదలను నమోదు చేసుకుంటూ వస్తోంది. అలాగే పాత కృష్ణా జిల్లాలో విజయవాడ అతి పెద్ద పట్టణమైనా, మచిలీపట్నం ను జిల్లా కేంద్రంగా ప్రకటించడం ఒక కారణం.
==> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ జియో 5జి నెట్వర్క్ నగరాల జాబిత 2024
చిత్తూరు సిటీ, అలాగే ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం సిటీలు కూడా జిల్లా కేంద్రాలుగా ఉన్నా, జనాభా పరంగా వెనకడుగు వేస్తున్నాయి. వీటికి గల కారణాలను వేరే ఆర్టికల్ లో మాట్లాడుకుందాం. కొన్ని ఊర్లు మునిసిపాలిటీల పరంగా తక్కువ పాపులేషన్ కనబరచినా, వాటి చుట్టు పక్కల పంచాయతీల పరిధిలోని ప్రాంతాలు ఎప్పుడో ఈ నగరాల్లో విలీనం అయిపోయాయి. కానీ మున్సిపాలిటీల పరంగా, పంచాయతీల పరిధి పరంగా చాలా ఊర్లల్లో ఇలా జనాభా గణాంకాలు వ్యత్యాసం కనబరుస్తున్నాయి. ఇలా పంచాయతీల్లో కూడా ఆ పట్టణం విస్తరించి ఉండడంతో, వీటినే అర్బన్ పాపులేషన్ కింద లెక్కిస్తున్నారు. కాని కొన్ని ఊర్లు మున్సిపల్ కార్పొరేషన్ అయినా కూడా వాటిలో చుట్టుపక్కల ఉన్న మండలాలను విలీనం చేసినా కూడా వాటి జనాభా కొన్ని మున్సిపాలిటీ తో పోటీకి కూడా రాలేక పోతున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఇరవై నగరాల గురించి ఈ పోస్టులో జనాభా ప్రాతిపదికన వివరిస్తున్నాము. అంతకు ముందు చాలా మందికి తెలియని ఒక చిన్న విషయం మీ ముందు ఉంచుతున్నాము. ఒకప్పుడు నగరాలు అంటే రాత్రి పూట కూడా జనాలు తిరిగే వారని నమ్మేవాళ్ళము.కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం జనాభా ప్రకారంగా పల్లెలను, పట్టణాలను మరియు నగరాలను వర్గీకరిస్తున్నారు.
అందుకే ఈ పోస్టును టాప్ 20 సిటీస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (Top 20 Biggest Cities In Andhra Pradesh State) క్రింద అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద ఇరవై నగరాల జాబిత క్రింద మీ ముందు ఉంచుతున్నాము.
వైజాగ్ (విశాఖపట్నం) ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద రెండవ నగరంగా పేరుగాంచింది. హైదరాబాద్ తర్వాత ఎక్కువ జనాభా కలిగిన నగరంగా వైజాగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతిపెద్ద నగరంగా పేరుగాంచింది. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే వైజాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం గా ఉంది. వైజాగ్ అర్బన్ పాపులేషన్ (జనాభా) 24.6 లక్షల మంది. అలాగే వైజాగ్ కార్పొరేషన్ లిమిట్స్ లోని జనాభా 23.80 లక్షల మంది.
ఇక రెండవ అతిపెద్ద నగరంగా విజయవాడ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పటి నుంచో 3 వ అతి పెద్ద నగరంగా విజయవాడ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ రెండవ అతిపెద్ద నగరం. విజయవాడ సిటీ అర్బన్ పాపులేషన్ (జనాభా) మంగళగిరి, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం చుట్టు పక్కల ఉన్ప ప్రాంతాల్లోని జనాభా ను కలిపితే దాదాపు 20 లక్షల 32 వేలు. కానీ 2014 లో విజయవాడ సిటీ లిమిట్స్ ప్రకారం అయితే కేవలం 14 లక్షల 25 వేల జనాభా ఉంది. ఎందుకంటే మంగళగిరి, తాడేపల్లి మరియు విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతాలను ఇంకా విజయవాడ అర్బన్ లో విలీనం చెయ్యలేదు కాబట్టి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అతి పెద్ద నగరంగా గుంటూరు ఉన్నది. గుంటూరులో అర్బన్ జనాభా తొమ్మిది లక్షల ఇరవై మూడు వేలు (9,23,000). గుంటూరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో అతి పెద్ద 5 నగరాల్లో ఒకటిగా నిలిచింది. కానీ సిటీ లిమిట్స్ లో 8 లక్షల 91 వేల (8,91,000) జనాభా కలిగింది గుంటూరు నగరం.
ఇక నాలుగవ అతి పెద్ద నగరంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు సిటీ నిలుస్తుంది. నెల్లూరు అర్బన్ పాపులేషన్ (జనాభా) ఎనిమిది లక్షల పదహారు వేలు (8,16,000). భారత దేశంలోనే అతి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో నెల్లూరు ఒకటి. నెల్లూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో కేవలం ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల (6,88,000) జనాభా కలిగింది నెల్లూరు. అటు చెన్నై కి దగ్గరలో ఉండడమే కాకుండా, ఇటు పారిశ్రామిక పరంగా, విద్యాలయాల పరంగా సముద్ర తీరం దగ్గరగా ఉండడం వలన నెల్లూరు త్వరగా విస్తరిస్తోంది.
ఇక ఐదవ అతి పెద్ద నగరంగా రాయలసీమకు చెందిన కర్నూలు సిటీ నిలుస్తుంది. కర్నూలు అర్బన్ పాపులేషన్ (జనాభా) ఆరు లక్షల అరవై ఆరు వేలు (6,66,000). కానీ కర్నూలు సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో అయిదు లక్షల తొంభై రెండు వేలు (5,92,000). కర్నూలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి రాజధాని అయిన, తరువాత అభివృద్ధి లేమితో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ తో పోటీ పడలేక పొయ్యింది. అయితే రాయలసీమ ప్రాంతంలో అతి పెద్ద నగరంగా కర్నూలు ఇప్పటికీ నిలుస్తోంది.
ఇక ఆరవ అతిపెద్ద నగరంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సిటీ ఉన్నది. రాజమండ్రి అర్బన్ జనాభా ఆరు లక్షల యాభై వేలు (6,50,000). కానీ రాజమండ్రి కార్పొరేషన్ జనాభా కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలు (4,70,000) మాత్రమే. ఎంతో చరిత్ర కలిగిన రాణ్మహేంద్రవరం అభివృద్ధి పరంగా ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్లో ఏడవ అతి పెద్ద నగరంగా తిరుపతి ఉన్నది. తిరుపతి అర్బన్ జనాభా ఆరు లక్షల ముప్పై ఆరు వేలు (6,36,000). కానీ విచిత్రం ఏమిటంటే తిరుపతి కార్పొరేషన్ జనాభా కేవలం మూడు లక్షల తొంభై అయిదు వేలు మాత్రమే (3,95,000). స్పిరిట్యువల్ క్యాపిటల్ గా పిలవబడే తిరుపతి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వేగంగానే విస్తరిస్తోంది. దాదాపు సగానికి పైగా నగర్ జనాభా పక్కనున్న పంచాయతీల్లో ఉండడం విశేషం.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిదవ అతి పెద్ద నగరంగా కాకినాడ నగరం నిలుస్తుంది. కాకినాడ అర్బన్ జనాభా ఆరు లక్షల తొమ్మిది వేలు (6,09,000). కానీ కాకినాడ కార్పొరేషన్ జనాభా నాలుగు లక్షల ముప్పై వేలు (4,30,000) మాత్రమే. ఇలా ఎప్పటి నుంచో బాగా పాపులర్ అయిన తిరుపతి, రాజమండ్రి, కాకినాడ నగరాల్లో జనాభా ఎందుకు తక్కువగా ఉందో వేరే ఆర్టికల్ లో వివరిస్తాము.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదవ అతి పెద్ద నగరంగా రాయలసీమకు చెందిన కడప సిటీ నిలుస్తుంది. కడప అర్బన్ పాపులేషన్ జనాభా నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలు (4,74,000). కానీ కడప కార్పొరేషన్ జనాభా కూడా దాదాపు నాలుగు లక్షల వరకు ఉంది (4,00,071). అంటే కడప సిటీ అర్బన్ పాపులేషన్ మరియు కార్పొరేషన్ లిమిట్స్ లోని జనాభా దాదాపు 20 శాతం వ్యత్యాసం తో ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ అతిపెద్ద నగరంగా రాయలసీమకు చెందిన అనంతపూర్ నగరం నిలుస్తుంది. అనంతపూర్ అర్బన్ జనాభా (పాపులేషన్) నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు (4,68,000). కానీ విచిత్రం ఏమిటంటే అనంతపూర్ కార్పొరేషన్ జనాభా మాత్రం కేవలం మూడు లక్షల యాభై తొమ్మిది వేలు (3,59,000) మాత్రమే. ఇందుకు కూడా కారణాలు ఉన్నాయి. అనంతపూర్ లో దాదాపు లక్షకుపైగా చుట్టుపక్కల మండలాల నుంచి విలీనమైన జనాభా లక్షకు పైగా ఉన్నది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 వ అతిపెద్ద నగరంగా కోస్తాంధ్ర లోని ఏలూరు నగరం నిలుస్తుంది. ఏలూరు నగరం అర్బన్ జనాభా మూడు లక్షల నలభై అయిదు వేలు (3,45,000). అలాగే ఏలూరు నగరం కార్పొరేషన్ జనాభా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే (2,79,000).
తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 వ అతిపెద్ద నగరంగా పేరు సంపాదించుకున్న నగరం ఉత్తరాంధ్ర లోని విజయనగరం పట్టణం.
==> లారీల వెనుక Highly Inflammable అని ఎందుకు వ్రాస్తారు, Highly Flammable అని వ్రాయాలి కదా అని అనుమానం వచ్చింటే, ఈ Flammable, Inflammable, Nonflammable ఆర్టికల్ చదవండి.
విజయనగరం కార్పొరేషన్ అర్బన్ జనాభా మూడు లక్షల ఇరవై తొమ్మిది వేలు (3,29,000). అలాగే విజయనగరం సిటీ కార్పొరేషన్ జనాభా మూడు లక్షల పదమూడు వేలు (3,13,000). ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి పెద్ద నగరంగా విజయనగరం నిలుస్తుంది. వైజాగ్ తరువాత పెద్ద నగరంగా ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పేరు గడించింది. విజయనగరం లో దాదాపు అర్బన్ జనాభా మరియు కార్పొరేషన్ జనాభా ఒకేలా ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడవ అతి పెద్ద నగరంగా రాయలసీమ లోని ప్రొద్దుటూరు నిలుస్తుంది. ప్రొద్దుటూరు అర్బన్ జనాభా మూడు లక్షల రెండు వేలు (3,02,000). అలాగే ప్రొద్దుటూరు 1960 కి ముందే ఏర్పడిన ఏ1 గ్రేడ్ మునిసిపాలిటీ అయినప్పటికీ మునిసిపల్ కార్పొరేషన్ కాలేదు. అందుకే ప్రొద్దుటూరు మునిసిపాలిటీ జనాభా కేవలం రెండు లక్షల ఇరవై మూడు వేలు (2,23,000) మాత్రమే. దాదాపు ఎనభై వేల పైచిలుకు జనాభా వ్యత్యాసం ఉంది ప్రొద్దుటూరు అర్బన్ జనాభా కి మరియు మున్సిపాలిటీ జనాభా కి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 వ అతి పెద్ద నగరంగా రాయలసీమ లోని నంద్యాల పట్టణం నిలుస్తుంది. నంద్యాల అర్బన్ జనాభా రెండు లక్షల తొంభై వేలు (2,90,000). అలాగే నంద్యాల మున్సిపాలిటీ జనాభా రెండు లక్షల ఇరవై అయిదు వేలు (2,25,000).
తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 వ అతి పెద్ద నగరంగా ఒంగోలు సిటీ నిలుస్తుంది. ఒంగోలు అర్బన్ జనాభా రెండు లక్షల ఎనభై ఆరు వేలు (2,86,000). అలాగే ఒంగోలు కార్పొరేషన్ జనాభా రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి (2,21,000). ఒంగోలు సిటీ లో దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ జనాభా మరియు అర్బన్ జనాభా ఒకేలా ఉన్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 వ అతిపెద్ద నగరంగా రాయలసీమ లోని ఆదోని నగరం నిలుస్తుంది. ఆదోని అర్బన్ జనాభా రెండు లక్షల యాభై నాలుగు వేలు (2,54,000). అలాగే ఆదోని మున్సిపాలిటీ జనాభా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు (2,28,000).
తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 అతిపెద్ద నగరంగా రాయలసీమ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లి సొంతం చేసుకుంది. మదనపల్లి అర్బన్ జనాభా రెండు లక్షల నలభై ఎనిమిది వేలు (2,48,000). అలాగే మున్సిపాలిటీ జనాభా లక్షా ఎనభై ఏడు వేలు మాత్రమే.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 వ అతి పెద్ద నగరంగా చిత్తూరు పట్టణం నిలుస్తుంది. చిత్తూరు అర్బన్ జనాభా రెండు లక్షల నలభై ఒక వేలు (2,41,000). అలాగే చిత్తూరు కార్పొరేషన్ జనాభా రెండు లక్షల పదివేలు (2,10,000) మాత్రమే. చిత్తూరు పట్టణాన్ని చిత్తూరు జిల్లా కేంద్రం గా ఉండటం వల్ల ఎప్పటి నుంచో కార్పొరేషన్ కింద ప్రకటించారు. కానీ జనాభా పరంగా చిత్తూరు పట్టణం లో చాలా తక్కువ వృద్ధి నమోదు అవుతోంది. ఇందుకు ఒక ముఖ్య కారణం చిత్తూరు పట్టణం నుంచి పక్కనే ఉన్న బెంగళూరు సిటీలో స్థిరపడే వారి సంఖ్య అధికంగా ఉండడం వల్లనే. కానీ ఊరు విస్తీర్ణం పరంగా జిల్లా హెడ్ క్వార్టర్ అవడంవల్ల చాలా సువిశాలంగా ఉంటుంది చిత్తూరు పట్టణం.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 వ అతిపెద్ద నగరంగా కోస్తాంధ్ర లోని తెనాలి పట్టణం నిలుస్తుంది. తెనాలి అర్బన్ జనాభా రెండు లక్షల ఇరవై ఆరు వేలు (2,26,000). అలాగే తెనాలి సిటీ లిమిట్స్ లోని మున్సిపాలిటీ జనాభా లక్షా తొంభై నాలుగు వేలు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వ అతి పెద్ద నగరం ఏది అయ్యి ఉంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియ చేయండి.
Sources:
Vijayawada division numbers list 2024 and their corresponding localities: విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న డివిజన్ల నెంబర్లు…
Jio 5G In Andhra Pradesh Cities List 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ జియో తన 5జి నెట్వర్క్…
AS Rao Nagar Pincode, Hospitals, Diagnostic Centers full details in telugu. ఎఎస్ రావు నగర్ పూర్తి…
Flammable, Non Flammable, Highly Flammable Meaning In Telugu - ఫ్లేమబుల్, నాన్ ఫ్లేమబుల్, హైలీ ఇన్ఫ్లేమబుల్ అర్థాలు…
Biggest Malls In Hyderabad 2024 List : హైదరాబాద్ లో అతిపెద్ద మాల్స్ లిస్ట్ 2024. ఏఎమ్బీ సినిమాస్,…
This website uses cookies.
View Comments