హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, సిటిలో షాపింగ్ మాల్స్ కూడా భారీ ఎత్తున నిర్మింపబడుతున్నాయి. ఈ ఆర్టికల్ లో మీ కోసం హైదరాబాద్ నగరం లో ప్రస్తుతం గల పది అతి పెద్ద షాపింగ్ మాల్స్ ( Biggest malls in Hyderabad ) గురించి తెలియజేస్తున్నాం. ఆ మాల్స్ పేర్లతో పాటు, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో కూడా తెలియజేస్తున్నాం. ఈ హైదరాబాద్ లో టాప్ సెవెన్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్స్ లిస్ట్ ని చదరపుల అడుగుల పరంగా పొందుపరిచాము.
అయితే ఈ లిస్ట్ లో హైదరాబాద్ కు అసలైన సినిమా మాల్ కల్చర్ ని పరిచయం చేసిన ప్రసాద్స్ ఐమాక్స్ ( Prasad’s IMAX ) ను కలపడం లేదు. Prasad’s IMAX ప్రసాద్స్ ఐమాక్స్ మినహా గా హైదరాబాద్ నగరం లో అతిపెద్ద మాల్స్ లిస్ట్ ను పొందుపరుస్తున్నాం.
(1) Biggest Malls In Hyderabad 1st – Sarath Capital City Mall – AMB Cinemas (శరత్ క్యాపిటల్ సిటీ మాల్, ఏఎమ్బీ సినిమాస్ )
Sarath Capital City Mall: శరత్ సిటీ క్యాపిటల్ మాల్ హైదరాబాద్ లోనే కాదు, భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటిగా పేరు దక్కించుకుంది. మొత్తం 19,31,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ శరత్ క్యాపిటల్ సిటీ మాల్ హైదరాబాద్ లో కొండాపూర్ లిమిట్స్ లో ఉంది.
శరత్ క్యాపిటల్ సిటీ మాల్ (Sarath Capital City Mall) పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఈ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ నుంచి చాలా మంది ఏఎమ్బీ సినిమాస్ (AMB Cinemas) గా లేదంటే ఏఎమ్బీ మాల్ గా పిలవడమే దానికి కారణం. సూపర్ స్టార్ మహేష్ బాబు కి మరియు ఏషియన్ సినిమాస్ కు చెందిన ఏఎమ్బీ సినిమాస్ ఉన్నది ఈ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లోనే.
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కొండాపూర్ లిమిట్స్ లో ఉంది. ఇది అటు గచ్చిబౌలి, మియాపూర్ మరియు హైటెక్ సిటీ ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉంది. అందుకే ఈ మాల్ లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వారి కుటుంబాలతో వారాంతంలో కోలాహలంగా వుంటుంది.
అంతే కాదు, మహేష్ బాబు కి మరియు ఏషియన్ మూవీస్ అధినేత కి చెందిన ఏఎమ్బీ సినిమాస్ (AMB Cinemas) లో 7 స్క్రీన్స్ డాల్బీ అట్మాస్ 4k సదుపాయాలు ఉన్నాయి. ఇలా ఒకే మాల్ లో హైఎండ్ సినిమా స్క్రీనింగ్స్ ఎక్కడా లేవు. అందుకే ఏఎమ్బీ సినిమాస్ లో కొత్త సినిమాలను వీక్షించేందుకు ప్రముఖ నటులు, దర్శకులు మరియు సెలబ్రిటీలు ఉత్సుకత చూపిస్తుంటారు. ఈ సెలబ్రిటీలను చూసేందుకు చాలా మంది అభిమానులు కొత్త సినిమాలను ఈ ఏఎమ్బీ సినిమాస్ లో చూసేందుకు వస్తుంటారు.
(2) Biggest Malls In Hyderabad 2nd – GVK One Mall (జీవీకే వన్ మాల్ )
GVK One (GVK Inox): జీవీకే వన్ మాల్ బంజారాహిల్స్ లో ఉంది. ఇది హైదరాబాద్ సిటీలో రెండవ అతిపెద్ద మాల్. హైదరాబాదీయులకు అసలైన పూర్తి మాల్ కల్చర్ ని పరిచయం చేసిందే ఈ జీవీకే వన్ మాల్.
జీవీకే వన్ (GVK One) మాల్ లో మొత్తం 15,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య కలాపాలును నిర్వహిస్తున్నారు. షాపింగ్, సినిమాలతో పాటు చిన్న పిల్లలకు ఆటల సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చిన మొదటి మాల్స్ లో ఒకటిగా పేరు గడించింది జీవీకే వన్ మాల్.
(3) Inorbit Mall, Hitech City – ఇన్ఆర్బిట్ మాల్, హైటెక్ సిటీ, హైదరాబాద్
Inorbit Mall, Hitech City: హైటెక్ సిటీ ప్రాంతంలో నిర్మింపబడిన మొదటి మాల్ ఇన్ఆర్బిట్ మాల్ (Inorbit Mall). ఇది హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం అతిపెద్ద 3వ మాల్. ఈ మాల్ లో 10,00,000 చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో వాణిజ్య కలాపాలును నిర్వహిస్తున్నారు. ఇన్ఆర్బిట్ మాల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు అతి సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ ఫుడ్ కోర్ట్ ల తో పాటు, రిఫ్రెష్ మెంట్ కోసం గేమ్స్, బార్ పబ్ లాంజ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి.
(4) Fourth Biggest Mall In Hyderabad – Forum Sujana Mall (ఫారమ్ సుజనా మాల్)
Forum Sujana Mall ఫారమ్ సుజనా మాల్ కేపీహెచ్బి (Kphb colony) ప్రాంతంలో నిర్మితమైన మొట్టమొదటి హైఎండ్ మాల్. ఈ మాల్ హైదరాబాద్ సిటీ లో నాలుగవ పెద్ద మాల్. సుజనా మాల్ దాదాపు 8,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించిన ఒక పెద్ద అత్యాధునిక మాల్. సుజనా మాల్ లో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్ తో ఫుడ్ కోర్టులు మరియు షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి. ఫారం సుజనా మాల్ బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ హైదరాబాద్ లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది.
అసలే రద్దీ ప్రాంతం అయిన కేజీహెచ్బీ కాలనీ లో ఉండటం వల్ల ఈ మాల్ కూడా దాదాపు ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, వారాంతంలో మరియు శెలవు దినాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది.
(5) Biggest Malls In Hyderabad 5th – City Center Mall (బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ హైదరాబాద్ లో సిటీ సెంటర్ మాల్ 5వది.
సిటీ సెంటర్ మాల్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ ఒకటి లో ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న అతి పెద్ద మాల్స్ జాబితా ( Biggest Malls in Hyderabad List) లో 5వ స్థానంలో ఉంది. ఈ సిటీ సెంటర్ మాల్ దాదాపు 6,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ మాల్ లో ఎక్కువగా షాపింగ్ స్టోర్స్ కలవు. దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడ దర్శనమిస్తాయి. షాపింగ్ చేయాలనుకునే వారి కోసం ఈ మాల్ బాగా సూట్ అవుతుంది.
(6) Lulu Mall, KPHB Colony – లులూ మాల్
Lulu Mall, Hyderabad: లులూ మాల్ కేపీహెచ్బి కాలనీ లోని జేఎన్టీయూ రోడ్ లో ఉంది. ఇది దాదాపు 4,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇతర మాల్స్ కి ఈ లులూ మాల్ కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ మాల్ లో ఎక్కువగా లులూ గ్రూప్ కు చెందిన అవుట్ లెట్స్ దాదాపు 40 శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. అలాగే ఫుడ్ అవుట్ లెట్స్ మరియు షాపింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. హైపర్ మార్కెట్ అయితే ఏకంగా రెండు అంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడ కూరగాయలు, డైరీ ప్రొడక్ట్స్, మాంసం వంటి వంట సామాగ్రి అంతా దొరుకుతుంది.
యూఏఈ కంపెనీ అయిన లులూ గ్రూప్ (Lulu Group) ఈ మాల్ లో తమ హైపర్ మార్కెట్ ని, లులూ ఫ్యాషన్స్ ని, లులూ కనెక్ట్ ని, ఇతర లులూ స్టోర్స్ ని అందుబాటులోకి తెచ్చింది. దాదాపు దుబాయ్, యూఏఈ లాంటి గల్ఫ్ దేశాల్లో లభించే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, సెంటు, స్ప్రే బాటిల్లు, మెటల్ ఆర్ట్స్ వంటివి ఇక్కడ చవకగా కొనుగోలు చేయవచ్చు. అందుకే ఈ మాల్ లో విపరీతమైన రద్దీ ఉంటుంది.
(7) Next Galleria Mall – నెక్స్ట్ గెల్లేరియా మాల్
Next Galleria Mall: నెక్స్ట్ గెల్లేరియా మాల్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ సమీపంలో ఉంది. ఈ మాల్ డిజైన్ హైదరాబాద్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందించారు. నెక్స్ట్ గెల్లేరియా మాల్ ఒక ఓడ ఆకారాన్ని పోలి వుంటుంది. మనకు ఈ మాల్ ని చూస్తే టైటానిక్ షిప్ గుర్తుకు వస్తుంది. ఈ నెక్స్ట్ గెల్లేరియా మాల్ ని ఎల్ఎన్టీ కంపెనీ మెట్రో ప్రాజెక్టు కు అనుసంధానంగా నిర్మించారు.
అందుకే ఈ నెక్స్ట్ గెల్లేరియా మాల్ ( Next Galleria Mall) కు పంజాగుట్ట మెట్రో స్టేషన్ నుంచి స్కై వాక్ బ్రిడ్జి మీదుగా సరాసరి మాల్ లోని రెండవ అంతస్తులోకి వెళ్ళవచ్చు. ఈ మాల్ అన్ని రకాలుగా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మాల్ లో పీవీఆర్ సినిమాస్, గేమింగ్ జోన్, ఫుడ్ కోర్టులు మరియు షాపింగ్ స్టోర్స్ కలవు. మొత్తం 5 అంతస్తుల్లో దాదాపు 150 కి పైగా స్టోర్స్ కలవు.
గమనిక: ఈ బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ హైదరాబాద్ లిస్ట్ (Biggest Malls In Hyderabad List) ను 2024 జనవరి నాటికి అనుగుణంగా ప్రచురించడం జరిగింది. త్వరలో ఈ జాబితాలో మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. దిల్షుక్ నగర్ లో, ఎల్బీ నగర్ లో ఇంకా ఇతర ప్రాంతాల్లో పెద్ద మాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి.