AP And Telangana

AS Rao Nagar Pincode Full Details | ఏఎస్ రావు నగర్ పూర్తి వివరాలు

AS Rao Nagar Full Details In Telugu: ఏఎస్ రావు నగర్ సికింద్రాబాద్ లోని ప్రముఖ నివాస ప్రాంతాల్లో ఒకటి. దీనినే డాక్టర్ ఏఎస్ రావు నగర్ గా కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతానికి ప్రముఖ తెలుగు సైంటిస్ట్ డాక్టర్ అయ్యగారి సాంబశివరావు గారి గౌరవార్థం నామకరణం చేశారు. డాక్టర్ సాంబశివరావు గారు హైదరాబాద్ లోని ఈసీఐఎల్ వ్యవస్థాపకులు.

ఏఎస్ రావు నగర్ చుట్టుపక్కల ప్రాంతాల వివరాలకు వస్తే సైనిక్ పురి కాలనీ, విద్యానగర్, మౌలాలి, ఈసీఐఎల్, కాప్రా, నేరేడ్మెట్ కలవు. అందువల్ల ఈ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగస్తులు ఏఎస్ రావు నగర్ లో స్థిరపడ్డారు. దాదాపు 70 శాతానికి పైగా ఎఎస్ రావు నగర్ లో ఎంప్లాయిస్ నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ఏఎస్ రావు నగర్ ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది అలాగే ఈ ప్రాంతం మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇది సికింద్రాబాద్ సిటీలో ఉన్నా, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. కాగా ఇది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) క్రిందికి వస్తుంది. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో కాప్రా సర్కిల్ క్రింద 2వ వార్డు. ఈ ఏఎస్ రావు నగర్ పిన్ కోడ్ 500062. అయితే ఈ ప్రాంతానికి ఇంకా మెట్రో రైలు సౌకర్యం లేదు.

Cinema And Entertainment

ఇక ఎంటర్టైన్మెంట్ కోసమైతే ఏఎస్ రావు నగర్ లో రాధిక మల్టీప్లెక్స్ మరియు శారదా థియేటర్లు కలవు. రాధిక మల్టీప్లెక్స్ లో సినిమా థియేటర్లే కాకుండా, షాపింగ్ మాల్స్, ఫుడ్ అవుట్ లెట్లు అన్ని కూడా ఉండడంతో ఎప్పుడూ జనాలతో కలకలలాడుతూ ఉంటుంది.

Jewellery Stores In AS Rao Nagar- బంగారు దుకాణాలు

మహిళలకు అత్యంత ప్రీతికరమైన బంగారు ఆభరణాల విషయానికి వస్తే ఏఎస్ రావు నగర్ లో బంగారు దుకాణాలకు కొదవ లేదు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎఎస్ రావు నగర్ లో గోల్డ్ షాప్స్ ఎక్కువనే చెప్పాలి. ఎఎస్ రావు నగర్ లో జి.ఆర్.టి జ్యువెలర్స్, జాయ్ అలుకాస్, తనిష్క్ జ్యువెలర్స్, వైభవ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, రిలయన్స్ జివెల్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఖజానా, బ్లూ స్టోన్ జ్యువెలరీ, హీరా మోటి జ్యువెలర్స్ వంటి ప్రముఖ బంగారు మరియు వెండి దుకాణాలు కలవు.

Clothing Stores In AS Rao Nagar – వస్త్ర దుకాణాలు

అలాగే ఏ ఎస్ రావు నగర్ లో ఆర్ఎస్ బ్రదర్స్, అన్లిమిటెడ్ ఫ్యాషన్ స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, కె.ఎల్.ఎమ్ ఫ్యాషన్ మాల్, మాన్యవర్, చెన్నై షాపింగ్ మాల్, ముగ్ద సారీస్ వంటి ప్రముఖ బహుల అంతస్తుల వస్త్ర దుకాణాలు కలవు. ఇవే కాకుండా ప్యాంటలూన్స్, వెస్ట్ సైడ్, రేమండ్స్, అరవింద్, రాంరాజ్ కాటన్, మ్యాక్స్, జాకీ, ఇండియన్ టెర్రియన్ లాంటి అన్ని ప్రముఖ కంపెనీల అవుట్ లెట్లు ఎఎస్ రావు నగర్ లో ఉన్నాయి.

Electronic Stores In AS Rao Nagar – ఎలక్ట్రానిక్ స్టోర్స్

ఏఎస్ రావు నగర్ లో ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూం లే కాకుండా ప్రముఖ బ్రాండ్ల అవుట్ లెట్లు చాలానే ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్, క్రోమా, పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, తిరుమల ఎలక్ట్రానిక్స్, ఆపిల్ కంపెనీ రీసెల్లర్ అయినటువంటి ఆప్ట్రానిక్స్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ లు కలవు.

Hospitals In A.S. Rao Nagar – ఏ.ఎస్.‌రావు నగర్ లో హాస్పిటల్స్

ఏఎస్ రావు నగర్ లో హాస్పటల్స్ విషయానికి వస్తే అపోలో క్లినిక్, శ్రేయస్ హాస్పిటల్ అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, జెం కేర్ పొలోమి హాస్పిటల్, సన్రిడ్జ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వనజా డయాబెటిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తాత హాస్పిటల్, వేద హెల్త్ కేర్ మరియు శౌర్య హాస్పిటల్ వంటి ప్రముఖ హాస్పటల్స్ ఇక్కడి ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాయి.

Diagnostic Centers In Dr AS Rao Nagar – రక్త పరీక్ష మరియు డయాగ్నస్టిక్స్ కేంద్రాలు

అలాగే స్కానింగ్, రక్త పరీక్షల కోసమైతే ఎఎస్ రావు నగర్ లో విజయ డయాగ్నస్టిక్స్, అరుణ స్కాన్ అండ్ డయాగ్నస్టిక్స్, స్ప్రింట్ డయాగ్నస్టిక్స్, మెడ్ ప్లస్ డయాగ్నస్టిక్స్ వంటి ప్రముఖ డయాగ్నస్టిక్స్ కేంద్రాలే కాకుండా ఇంకా ఒక నాలుగైదు డయాగ్నస్టిక్స్ సెంటర్స్ కలవు.

Famous Restaurants In AS Rao Nagar – ప్రసిద్ధి పొందిన రెస్టారెంట్ల జాబితా

ఎఎస్ రావు నగర్ లో రుచికరమైన భోజనానికి అనేక రెస్టారెంట్ ఆప్షన్లు ఉన్నాయి. బఫే, మండి, కుండ బిర్యాని లాంటి అన్ని సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే కృతుంగా ట్రైన్ రెస్టారెంట్ ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంది.


ఎ.ఎస్ రావు నగర్ లో బాగా ప్రసిద్ధి పొందిన రెస్టారెంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • ది కాఫీ కప్
  • కృతుంగా ట్రైన్ రెస్టారెంట్
  • 5మంకీస్ (నాటు కోడి మండి)
  • బిబిక్యూ నేషన్
  • ఏబీస్ అబ్సొల్యూట్ బార్బీక్యూస్
  • పరివార్ రెస్టారెంట్ (రాధికా మల్టీప్లెక్స్)
  • బకాసుర రెస్టారెంట్
  • ది జాయింట్ అల్-మండి
  • లావిష్ ఫ్యామిలీ రెస్టారెంట్

Tiffin Centers – టిఫిన్ సెంటర్స్

అలాగే టిఫిన్ సెంటర్ల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్, ఈశ్వరి టిఫిన్ సెంటర్, రెడ్డి టిఫిన్ సెంటర్, అమ్మా టిఫిన్స్ ప్రసిద్ధి పొందాయి. అలాగే శ్రీ బాలాజీ మెస్ అండ్ టిఫిన్ సెంటర్ కూడా బాగా పాపులర్ అయిన మెస్.

Share
Kiran Reddy

Recent Posts

Vijayawada Division Numbers List 2024 | విజయవాడ డివిజన్ నెంబర్ల లిస్టు

Vijayawada division numbers list 2024 and their corresponding localities: విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న డివిజన్ల నెంబర్లు…

6 March 2024

Jio 5G In Andhra Pradesh Cities List 2024 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జియో 5జి పట్టణాల జాబితా

Jio 5G In Andhra Pradesh Cities List 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ జియో తన 5జి నెట్వర్క్…

4 March 2024

Top 20 Biggest Cities In Andhra Pradesh List 2024 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 అతి పెద్ద నగరాల జాబితా

20 Biggest Cities In Andhra Pradesh List 2024 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 అతి పెద్ద నగరాల…

29 February 2024

Flammable, Non Flammable, Highly Inflammable Meaning In Telugu

Flammable, Non Flammable, Highly Flammable Meaning In Telugu - ఫ్లేమబుల్, నాన్ ఫ్లేమబుల్, హైలీ ఇన్ఫ్లేమబుల్ అర్థాలు…

31 January 2024

Top 7 Biggest Malls In Hyderabad || టాప్ 7 బిగ్గెస్ట్ మాల్స్ ఇన్ హైదరాబాద్

Biggest Malls In Hyderabad 2024 List : హైదరాబాద్ లో అతిపెద్ద మాల్స్ లిస్ట్ 2024. ఏఎమ్బీ సినిమాస్,…

24 January 2024

This website uses cookies.