Flammable, Non Flammable, Highly Inflammable Meaning In Telugu

ఫ్లేమబుల్(Flammable), నాన్ ఫ్లేమబుల్ (Non Flammable) మరియు ఇన్ఫ్లేమబుల్ (Inflammable) పదాలు దాదాపుగా ఇంగ్లీష్ వచ్చిన వారినందరినీ ఎప్పుడో ఒకప్పుడు కన్ఫ్యూజ్ చేసే పదాలు. వీటిలో అసలైన ఆంగ్ల పదం ఒకటైతే, ఎక్కువగా వాడుకలో ఉన్న పదం మరొకటి. వీటి గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ Flammable, Non Flammable And Highly Inflammable Meaning In Telugu పోస్ట్ లో వీటి అర్థాలతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తున్నాము.

మనము ఈ flammable కి సంబంధించిన వాక్యాలు ఎక్కువగా లారీల వెనుక, పెట్రోల్ బంకుల్లో చూస్తూ ఉంటాం. వీటిని ఒక్కొక్కటిగా క్రింద తెలుసుకుందాం.

  • Flammable Meaning In Telugu – ఫ్లేమబుల్ అర్థం
  • Non Flammable Meaning In Telugu – నాన్ ఫ్లేమబుల్ అర్థం
  • Inflammable Meaning In Telugu – ఇన్ఫ్లేమబుల్ అర్థం
  • Highly Inflammable Meaning In Telugu – హైలీ ఇన్ఫ్లేమబుల్ అర్థం

Flammable Meaning In Telugu – ఫ్లేమబుల్ అర్థం తెలుగు లో

ఫ్లేమబుల్ అంటే మంట లేదా నిప్పు పెట్టడం వలన మాత్రమే మండగలిగేవి అని అర్థం. మంట లేనప్పుడు ఇవి ప్రమాదకరం కావు. వీటిలో కొన్ని వస్తువులు మన అవసరాలకు తరుచుగా వాడుతుంటాం. తగు జాగ్రత్తలు తీసుకొనడం వలన వీటిని మనం ఇల్లల్లో నిల్వ ఉంచుకోవచ్చు. పూర్తి జాగ్రత్తలు తీసుకొంటే వీటి వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. కానీ మానవ తప్పిదం వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం గుర్తుకు పెట్టుకోవాలి.

Flammable Examples In Telugu – ఫ్లేమబుల్ వస్తువుల ఉదాహరణలు

చెక్క ముక్కలు, పేపర్, బొగ్గు, పొట్టు, ప్లాస్టిక్ కవర్లు, టైర్లు, ట్యూబ్లు, రబ్బరు వస్తువులు, ఎండిన ఆకులు మొదలైనవి ఫ్లేమబుల్ వస్తువుల ఉదాహరణలు.

Non Flammable Meaning In Telugu – నాన్ ఫ్లేమబుల్ అర్థం తెలుగు లో

నాన్ ఫ్లేమబుల్ అంటే మండే గుణతత్వం లేనివి అని అర్థం. ఫ్లేమబుల్ కి వ్యతిరేక పదంగా నాన్-ఫ్లేమబుల్ అనే పదాన్ని మాత్రమే వాడాలి.

ఉదాహరణకు ఇటుక, రాయి, నీరు, అద్దం మొదలైనవి నాన్ ఫ్లేమబుల్ వస్తువులు. వీటికి నిప్పు పెట్టి మండించాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఎవ్వరికీ తెలియదు.

Inflammable Meaning In Telugu – ఇన్ ఫ్లేమబుల్ అర్థం తెలుగు లో

మనకు పూర్తి కన్ఫ్యూజన్ ఈ ఇన్ ఫ్లేమబుల్ పదాన్ని విన్నప్పుడు వస్తుంది. ఇన్ ఫ్లేమబుల్ అంటే మంట లేదా నిప్పు పెట్టక పోయినా మండగలిగేవి అని అర్థం. ఇవి ప్రమాదకరం. వీటికి 200 మీటర్ల దూరంలో లేదా వీలైనంత దూరంగా ఉండండి అని లారీల వెనుక, వీటిని నిల్వ ఉంచిన ప్రదేశాలలో వ్రాసి మరీ హెచ్చరిస్తూ ఉంటారు.

Why Inflammable Objects Are Dangerous? – ఇన్ఫ్లేమబుల్ వస్తువులు ఎందుకు చాలా ప్రమాదకరం?

ఇన్ఫ్లేమబుల్ తత్వం కలిగినవి ఎక్కువగా గ్యాస్, లిక్విడ్ రూపంలో నిల్వ చేయబడి ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఇవి మండాలంటే తప్పనిసరిగా నిప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి పొరపాటున ఒక చిన్న కెమికల్ రియాక్షన్ కు లోనైనా, అణువుల రాపిడి వలన భారీగా పేలుతాయి. ‌సాధారణంగా వీటిని ఎక్కువగా కంప్రెస్డ్ చేసి ఉంటారు. అందుకే పేలుడు సమయంలో కంప్రెస్డ్ గా ఉండే అణువులు, ఒక్కసారిగా ఫ్రీ అవడం వలన భారీ విస్పోటనం జరుగుతుంది. అందుకే వీటి మంటలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి.

Inflammable Examples In Telugu – ఇన్ఫ్లేమబుల్ వస్తువుల ఉదాహరణలు

పెట్రోలియం వస్తువులు, కిరోసిన్, ఎల్పీజీ గ్యాస్, సీఎన్జీ గ్యాస్, పెయింట్ టిన్నర్లు, టపాకాయలు, మెగ్నీషియం ఉత్పత్తులు మొదలైనవి ఇన్ఫ్లేమబుల్ వస్తువుల ఉదాహరణలు.

Highly Inflammable Meaning In Telugu
హైలీ ఇన్ఫ్లేమబుల్ గురించి తెలుగు లో

హైలీ ఇన్ ఫ్లేమబుల్ అంటే అత్యంత ప్రమాదకరమైన విస్పోటనం చెందగలిగేదని అర్థం. ఇది ఫైనల్ లెవెల్ అనే చెప్పాలి. ఇన్ఫ్లేమబుల్ వస్తువుల క్రిందికే వచ్చినా, హైలీ ఇన్ఫ్లేమబుల్ వస్తువులు అత్యంత ప్రమాదకరం.

About Highly Inflammable In Telugu – హైలీ ఇన్ఫ్లేమబుల్ గురించి తెలుగు లో

వీటిని ఎక్కువగా కంప్రెస్డ్ చేసి గ్యాస్ రూపంలో నిల్వ చేస్తుంటారు. వీటి విస్పోటనం వలన మానవాలి పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటి ప్రభావం కూడా చాలా రోజుల వరకు ఉంటుంది. వాయువులు కూడా కాలుష్యం చెందుతాయి. ఇప్పుడైతే ప్రమాదం తరువాత నాలుగైదు రోజుల్లోనే వాయు కాలుష్యాన్ని నియంత్రణలోకి తెస్తున్నారు.

హైలీ ఇన్ఫ్లేమబుల్ వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం చట్టరిత్యా నేరం. వీటిని ఉత్పత్తి చేయాలన్నా లేదా రవాణా చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు తప్పనిసరి. వైజాగ్ హైవేలో జరిగిన కొన్ని పేలుడు సంఘటనలు ఈ హైలీ ఇన్ఫ్లేమబుల్ వస్తువుల వలన జరిగినవే.

Highly Inflammable Examples In Telugu – హైలీ ఇన్ఫ్లేమబుల్ ఉదాహరణలు

బెంజీన్, అసిటోన్, మెథనాల్, సైక్లో హెక్సేన్ [మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి]

Leave a comment